మద్యపానం చేయకుండా ఉండడానికి పది గొప్పచిట్కాలు
21 రోజులలోగా సారాయి తాగడం మాన్పించవచ్చు.
1.మీ లక్ష్యాలను ప్రతిపాదించండి. మీ వ్యక్తిగత కారణాలేమిటి? మీ ఆలోచనలను వ్రాయడం వలనకొన్ని లక్ష్యాలకు ఇది మార్గదర్శకమౌతుంది. తాగడానికి యేర్పడే సంఘటనలకు దూరంగా ఉండడం, ఆ సన్నివేశంలో ఉంటూ తాగకుండా నియంత్రణ చేసుకోవడం లేదా పూర్తిగా మానివేయడం, ఇలా ఎందుకు చేస్తున్నారో ఏ ఒక్కరి కోసం కాకుండా అది మీకు ఖచ్చితంగా మీ కొరకే అనే కారణం తెలిసి ఉండడం, లేకపోతే మీరు ఈ విషయంలో విజయం సాధించలేరు.
2.తర్వాతి వారంలో తాగడం మానివేయడానికి ఒక్కరోజుని ఎంచుకోండి. ఒత్తిడికిలోను కాకుండ ఒక్కరోజు విశ్రాంతిగా ఉండండి. ఒక్కరోజుకి ప్రణాళికను వేసుకోవడం వలన సులభంగా తాగుడు మానివేయడానికి వీలవుతుంది.
3.మళ్ళీ దీనిని వదలకండి. మీరిప్పుడు చూస్తున్నవ్యాసం గంలో తాగుడు మానివేయడం సులభమని మేము చెప్పడంలేదు. మెదట మీ లక్ష్యాలను మొదటి స్థానంలో ఉంచి, మీ లక్ష్యాలను మీకున్న కారణాలతో మనస్సులో పెట్టుకోండి. ఒకవేళ ఒకేరోజు ఎక్కువగా తాగవలసివచ్చినా / తాగినా ఆ మాత్రాన మీరు చేరుకొన దలచిన గమ్యం లేదా మీరు అనుకున్న లక్ష్యంను మరువకండి. తర్వాతి రోజుకి మీరనుకున్న మార్గంలోకి వెళ్ళండి. మీరు గనుక ఇందులో విజయాన్ని సాధించలేకపోతే,రాబర్ట్.ఎఫ్ కెన్నడి చెప్పిన విషయాన్ని గుర్తుతెచ్చుకోండి –‘ ఎవరైతే అపజయాన్ని ధైర్యంగా ఎదుర్కొంటారో వారే విజయాన్ని కూడ గొప్పగా సాధిస్తారు’ . మీ యొక్క తాగుడు అలవాటుని నియంత్రణలో ఉంచుకుంటారా లేదా పూర్తిగా మానివేస్తారా అనేది మీరు ఖచ్చితంగా అనుకుంటేనేవిజయం సాధించగలరు.
4.మీ ప్రణాళికను ఇతరులతో పంచుకోండి. మీ కుటుంబ సభ్యులతోను, మీరు నమ్మే మీ స్నేహితులతోను మీ ఆలోచనను తెల్పండి. వారంతా మీ విజయానికిమీకెంతవరకు సహాయపడగలరో తెలుసుకోవచ్చు.
5.మీ కుటుంబ సభ్యుల, స్నేహితుల సహకారాన్నికోరండి. మీ సంబంధిత అంశాలనువారి ముందుంచినట్లైతే మీకు వారి సెలవు దినాలలో పూర్తి సహకారం సంతోషంగా అందించగలరు.
6.పూర్తిగా వారంలో ఒకరోజు మానివేయడానికి కూడ ప్రయత్నంచేస్తూ, మీరు తీసుకునే మద్యాన్ని తగ్గించి తీసుకోవాలనే ప్రయత్నంచేస్తూ, విరామం ఇవ్వండి. ఒక్కరోజు ఇలా చేయడం సులభమవుతుంది దీనినే రెండు రోజులకు తర్వాత మూడురోజులకు పొడిగిస్తూ చివరకు వారానికి పెంచాలి. మీరనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో, పెద్దగమ్యాన్ని చేరడానికి, దానినే చిన్న, చిన్న భాగాలుగా చేసుకుంటే అది మీకు ఇంకా సులభతరమౌతుంది.
7.మీరు గట్టిగా నిర్ణయించుకున్న తర్వాతనే దానిని వదిలి పెట్టడానికి ప్రణాళిక వేసుకోండి. మీ ఆలోచనకనుగుణంగామీరు ఇంటిలో ఉన్నను, మీరేదైన పార్టీలో ఉన్నా మద్యానికి బదులుగా ఇతర పానీయాన్ని తాగాలి .తాగుడు అలవాటుకి దూరంకావడానికి తగిన విధంగా ప్రణాళిక వేసుకొని మీ వ్యక్తిగత అభిరుచులకు తగిన నిర్మాణాత్మకమైన అంటే వ్యాయామం, పుస్తకాలు చదవడం పెయింటింగ్ చేయడం, లేదా ఇతర ఇష్టాలను చేపట్టడం చేయాలి.
8.ప్రలోభాలకు లోనుగాకుండా ఉండాలి. మీకు ఎప్పుడు తాగాలనిపిస్తుంది? మీరు పార్టీలో ఉన్నప్పుడా లేదా ఒంటరిగా ఉన్నప్పుడా? మీకు ఎలాంటప్పుడు తాగడానికి ఆకర్షితులవుతారో సరిగ్గా తెలిసిపోతుంది. చిన్న పాటి చిట్కాలతో దానిని వదిలివేయడానికి ప్రయత్నించవచ్చు. మీరు పార్టీలలోగాని ఇంటిలోగాని ఆల్కహాల్ (మద్యానికి) కి బదులు మధుర పానీయాలను తీసుకోవడం చేయాలి. లేక పోతే గనుక పనికి వచ్చే సరదాలపై అంటే వ్యాయామం, చదవడం, పెయింటింగ్ , లేదా మీకిష్టమైన ఏవేని ఇతర అంశాలపై కూడ దృష్టి పెట్టండి.
9.మీరు మీకుటుంబ సభ్యులతో తాగుడుకి వినియోగించే డబ్బుతో హాయిగా గడపండి. బయటకు వెళ్ళి తినడం, సినిమా చూడడం, ఆటలు ఆడడం, క్రీడలలోపాల్గొనడం చేసిమీకు మీరే బహుమతిగా తీసుకోండి.
10.మీరు యిలా కొనసాగించాలంటే కష్టమనుకుంటే కొత్త వ్యూహాల కొరకు దర్శించండిః
No comments:
Post a Comment